Free the Farmer
Share this post

స్వాతంత్ర్యం కోసం రైతుల మేనిఫెస్టో

న్యాయం, శాంతి & శ్రేయస్సు కోసం

న్యాయ్ బందీధన్ ముక్తి  ధన్ వాప్సీ

బ్రిటీష్ వలస పాలన నుంచి భారత దేశానికి స్వాతంత్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటుతున్నప్పటికీ, మన జనాభాలో అత్యధికంగా ఉన్న రైతులు, కొన్ని చట్టాలు మరియు నిబంధనలతో ఇబ్బందులు పడుతూనే ఉన్నారు.

ఆస్తి హక్కుల గుర్తింపు

సమాజంలోని అన్ని వర్గాలతో పోల్చితే రైతుల యాజమాన్య హక్కులపై క్రమం తప్పకుండా జరుగుతున్న దాడులతో వారు మరింత పేదరికంలోకి కూరుకుపోతున్నారు.

భూమి:

రైతులకు ఉండే ప్రాథమిక ఆస్తి భూమే. అయినా వీటికి అతి తక్కువగా విలువకడుతున్నారు. తరుచూ భూసేకరణ ముప్పును ఎదుర్కోవడంతో పాటు, భూవినియోగంలో ఆంక్షలు, అద్దెకు లేదా లీజుకు ఇవ్వడం, ల్యాండ్సీలింగ్తో పాటు, తప్పుల తడకగా ఉండే భూరికార్డులు, రుణాలు, పెట్టుబడి సౌకర్యాలు తక్కువగా ఉండడం, భూమిని సక్రమంగా వినియోగించుకోలేకపోవడం, అత్యంత తీవ్రంగా ఉన్న అవినీతితో రైతులు బాధపడుతున్నారు. గిరిజన తెగలు, రైతుల్లో ఎక్కువభాగం భూమి పైనా, సహజ వనరులపైన తమ హక్కులను గుర్తించాలంటూ పోరాడుతున్నారు.

వ్యవసాయ ఉత్పత్తి:

రైతుల శ్రమతో వచ్చే ఉత్పత్తులకు సరైన మార్కెటింగ్ సదుపాయాలు లేకపోవడంతో పాటు అంతులేని ఆంక్షలతో అతి తక్కువగా విలువ కడుతున్నారు, వ్యవసాయ ఆధారిత ఆదాయాన్ని తగ్గించడానికి చట్టాలు, రాజకీయాలు కలిసి కుట్రపన్నుతున్నాయి.

సాంకేతికత:

దీనివల్ల ఉత్పత్తితో పాటు ఆదాయం పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, పర్యావరణానికి హాని జరగకుండా కాపాడగలుగుతుంది, అయినప్పటికీ సాంకేతికతను అందిపుచ్చుకోవడంపై ఆంక్షలో లేదంటే నిషేధాలో అమలవుతున్నాయి, పర్యావరణానికి హాని కలిగించే రీతిలోనే పంటలను రైతులు పండించేలా చేస్తున్నాయి. ఇది కొన్నిసార్లు ప్రమాదరకమైన సాంకేతికను రైతులు రహస్యంగా ఉపయోగించేలా చేస్తుంది.

17 లోక్సభ ఎన్నికల నేపథ్యంలో, రైతులు స్వాతంత్ర్యం కోసం పిలుపునిస్తున్నారు, దేశంలోని ప్రతీ పౌరుడూ తమ ఆవేదనను వినాలని కోరుకుంటున్నారు. ఇది కేవలం రైతుల భవిష్యత్తు కోసం మాత్రమే కాదు, భారతదేశ భవిష్యత్తు కోసం తమ పోరాటాన్ని అర్థం చేసుకోమంటున్నారు.

    • భారతదేశ వ్యవసాయరంగం ప్రైవేటు రంగంలోని అతిపెద్ద వ్యవస్థ. న్యాయపరంగా మరియు నియంత్రణాపరమైన ఆంక్షల కారణంగా రైతులు పేదరికంలోనే ఉండాల్సి వస్తోంది. వారికి స్వాతంత్ర్యం లేకుండా పోవడంతో పాటు ప్రజలందరీ శ్రేయస్సూ దెబ్బతింటోంది.
    • వినియోగదారులు ఎక్కువగా చెల్లిస్తున్నా.. వ్యవసాయోత్పత్తులకు తక్కువ ధరలు, మార్కెట్వసతులు లేకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
    • పెద్దనోట్ల రద్దుతో, వ్యక్తిగత ఆస్తులపై ప్రభుత్వం చేసే దాడి ఎలా ఉంటుందో ప్రతీ ఒక్క భారతీయుడికీ తెలిసొచ్చింది. రైతులకు కూడా తమ ఆస్తి విలువను రోజూ వారీగా తగ్గించడం వల్ల ఇలాంటి అనుభవమే ఎదురవుతోంది. తాజాగా గో రక్షణ పేరుతో సాగుతున్న వేధింపుల కారణంగా, చాలా మంది రైతులు తమ పశువులను వదిలేయాల్సి వస్తోంది, దీనివల్ల పెట్టుబడిని కోల్పోవడమే కాకుండా, వీధి పశువులు ఎక్కడ పొలాలను నాశనం చేస్తాయో అన్న భయంతో నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తోంది. భారతదేశంలో రైతుల హక్కులను అణిచివేస్తూ, వారికి స్వాతంత్ర్యం ఇవ్వకుండా ఉంటే మాత్రం భారతదేశం ఎప్పటికీ బాగుపడదు.

స్వాతంత్ర్యం కోసం రైతుల మేనిఫెస్టో డిమాండ్లు:

    1. ప్రజావసరాల కోసం బలవంతపు భూసేకరణను ఆపివేయడం, దీనివల్ల ప్రభావితమయ్యే వారి సమ్మతి తీసుకున్న తర్వాతే భూసేకరణ చేయడం;
    2. వ్యవసాయ భూముల సీలింగ్చట్టాలను రద్దుచేయడం, భూవినియోగంపై, అద్దెకు ఇవ్వడం, లీజు లేదా అమ్మకం, అలాగే ఒప్పందపు వ్యవసాయంపై ఆంక్షలు తొలగించడం;
    3. అగ్రికల్చర్ప్రొడ్యూస్మార్కెటింగ్ కమిటీలు (APMC), నిత్యావసర వస్తువుల చట్టాలను రద్దు చేయడం ద్వారా వ్యాపారం మరియు వాణిజ్యాన్ని సులభతరం చేయడం;
    4. వ్యవసాయ ఉత్పత్తులన్నింటిలోనూ ఫ్యూచర్ ట్రేడింగ్ను అనుమతించడం, అడ్హక్మరియు అర్బిటరీ ఆంక్షలను తొలగించడం;
    5. నీళ్లు మరియు సహజ వనరులపై యాజమాన్య హక్కులను కల్పించడం, హక్కులతో లావాదేవీలను చేసుకునే అవకాశం కల్పించడం;
    6. పర్యావరణ పరిరక్షణ చట్టం మరియు బయోసేఫ్టీ రెగ్యులేషన్స్ను పరిమితం చేయడం ద్వారా సమాచార, సాంకేతిక, అధునాతన పద్దతులను అనుసరించే విధానాలను అందుబాటులోకి తేవడం;
    7. ప్రభుత్వ సంస్థలు మరియు ప్రైవేటు సంస్థల్లో స్వతంత్ర్ పరిశోధనలకు అవకాశం కల్పించడం, సమాచారం పొందడంలో రైతులకు సాధికారిత కల్పించడం, స్వతంత్ర నిర్ణయాలను తీసుకునేలా సేవలను పునరుద్దరించడం;
    8. పర్యావరణ పరంగా అవసరమైనవి, సామాజికంగా లాభసాటి అయినప్పటికీ, రైతులకు ఆర్థిక పరమైన ప్రయోజనాలను కల్పించలేని కార్యక్రమాలకు ఆర్థిక తోడ్పాటును అందించడం;
    9. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులను మెరుగుపరచడం ద్వారా స్టోరేజ్ మరియు ప్రాసెసింగ్పరిశ్రమను వికేంద్రీకరించడం వల్ల స్థానికంగా ఆర్థిక, ఉపాధి అవకాశాలను కల్పించడం;
    10. గిరిజన కుటుంబాలు, అడవుల్లో నివసించే ఇతర వర్గాల వారికి భూమిపైన, సహజ వనరులపైన ఉన్న హక్కులను గుర్తించడం;
    11. భూముల పరిస్థితి, భూవినియోగం, వినియోగదారులు, హక్కుదారులు మరియు ఇతరులకు సంబంధించిన వివరాలను సులువైన మరియు పారదర్శక విధానంలో కమ్యూనిటీ స్థాయిలో రికార్డు చేయడానికి పౌరులకు అనుమతి ఇవ్వడం, వాటిని భూ రికార్డుల్లోకి చేర్చడం;
    12. రైతుల ప్రాథమిక హక్కులను కాపాడడం మరియు న్యాయపరమైన సమీక్షకు అవకాశం ఇవ్వడం కోసం రాజ్యాంగంలోని 9 షెడ్యూల్ను రద్దు చేయడం;

స్వాతంత్ర్యం ముసాయిదా

న్యాయ్ బందీ 

స్వాతంత్ర్యం కోసం ఇస్తున్న పిలుపు మూడు ప్రాథమిక విధానపరమైన అంశాలపై ఆధారపడి ఉంటుంది. మేనిఫెస్టోలోని వ్యవసాయపరమైన సంస్కరణలు అన్నీ కార్యాచరణ ప్రణాళికగా మారాలి. ఏదేమైనా.. ఆర్థికవ్యవస్థ మరియు సమాజం అంతటికీ విధానాలు చాలా విలువైనవి.

ధన్ ముక్తి

అన్నదాతలు పేదవాళ్లే. ఎందుకంటే రైతులకు ఆస్తి ఉన్నా దానిని పెట్టుబడిగా పెట్టకుండా అనేక అడ్డంకులు ఉంటాయి. రైతుల భూములు మరియు ఇతర ఆస్తుల విలువకు సంబంధించి న్యాయం చేయాలి. ధన్ ముక్తి.. రైతుల ఆస్తులకు, వారికి పెట్టుబడి సౌకర్యాలకు, ఉత్పత్తి మరియు అభివృద్ధికి మార్గాన్ని ఏర్పాటు చేస్తుంది. శాంతి మరియు అభివృద్ధి కోసం సరైన వాతావరణాన్ని కల్పి్స్తుంది.

ధన్ వాప్సీ

ప్రభుత్వం. శాంతి భద్రతలను అమలు చేయడం, న్యాయాన్ని అందించడంపైనే స్వేచ్ఛాపూరితమైన వాతావరణం ఆధారపడి ఉంటుంది. కొన్ని ఏళ్లుగా భూముల రూపంలో, సహజవనరుల రూపంలో మరియు ఇతరత్రా విధానాల్లో ప్రజల నుంచి సేకరించిన ఆస్తులను తిరిగి ప్రజలకు ఇవ్వడం కోసమే ధన్ వాప్సీ పిలుపు. వనరులన్నీ. హరించిపోయిన వారి ఆస్తిహక్కులపైన, అణిచివేసిన స్వాతంత్ర్యం, జరిగిన అన్యాయాలపై అధ్యయనం చేయడానికి సహాయపడతాయి.

ప్యాకేజింగ్ విఫలమైన విధానాలు:

అధిక కనీస మద్దతు ధర, అధిక సబ్సిడీలు, వర్తకం మీద నిబంధనలు, రుణమాఫీ లాంటి పాత విధానాల విషయంలో రాజకీయ ఏకాభిప్రాయం ఉంటుంది. తాజాగా ఆదాయ మద్దతును అందిస్తా్మంటున్నారు. దీనివల్ల పంటల ధరల విషయంలో తేడా వస్తుంది. ఇది.. లేబర్ మార్కెట్ ను దారితప్పిస్తుంది. తరువాత సాగు వ్యయాన్ని పెంచుతుంది.

ఇటువంటి చర్యలు త్వరితగతిన వచ్చే సంక్షోభాన్ని తగ్గించడానికి సహాయపడతాయి. వ్యవసాయ క్షీణతను తగ్గించడంలో నిబంధనలు ఉపయోగపడతాయి.

రైతు నాయకుడైన దివంగత శరద్ జోషీ చెప్పిందేంటంటే.. తప్పుదోవ పట్టించే విధానాల వల్ల రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వీటి వల్ల మార్కెట్ తగ్గిపోతుంది. ధరలు పెరుగుతాయి. పంటకు సరసమైన ధర లభించదు. రైతుల ఆదాయం కూడా పడిపోతుంది. అందుకే ఆయన కర్జా ముక్తి కోసం పిలుపునిచ్చారు. దీనివల్ల బాధలు పడుతున్న రైతులకు గుర్తింపు వస్తుంది. వ్యవసాయరంగంలో ప్రాథమిక సంస్కరణలకు విఫలమైన విధానాలు ప్రత్యామ్నాయం కాదు. రైతులకు అభివృద్ధి, శ్రేయస్సు, లాభాలు చేకూర్చేలా సమర్థమైన విధానాలు, పరిష్కారాల కోసమే ఆయన పిలుపునిచ్చారు.


వ్యవసాయ విధానం

పేదరికం మరియు పుష్కలమైన వనరుల మధ్య..

1950 నుంచి ఇప్పటివరకు భారతీయ జనాభా నాలుగు రెట్లు పెరిగింది. ఆహార ధాన్యాల ఉత్పత్తి దాదాపు ఆరు రెట్లు పెరిగింది. గత 15 ఏళ్లుగా.. ఇండియా పెద్ద వ్యవసాయ ఎగుమతిదారుగా ఎదిగింది. కిందటి ఏడాది దాదాపు 36 బిలియన్ డాలర్ల ఉత్పత్తిని ఎగుమతి చేసింది.

ఐదు దశాబ్దాల కిందట నుంచి ఇప్పటివరకు చూస్తే.. ప్రపంచంలో ఊబకాయం కలిగిన ఐదు దేశాల్లో మన దేశం ఒకటి. అయినా సరే. ఇప్పటికీ దేశాన్ని ఆకలి వెంటాడుతోంది. ఐదేళ్లలోపు ఉన్న 40 శాతం మంది పిల్లలతో పాటు దాదాపు 15 శాతం మంది ప్రజలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ప్రభుత్వం దగ్గర ప్రపంచంలోనే అత్యధికంగా ఆహార ధాన్యాలు ఉన్నాయి. కాని దారుణమైన మౌలికవసతుల వల్ల ఆహారధాన్యాలు వృథా అవుతున్నాయి. సరుకుల నిల్వలో పెట్టుబడులు తగ్గించడం వల్ల పండ్లు, కూరగాయల ప్రాసెసింగ్ లో వృథా పెరుగుతోంది. ఆహారసంపద అవసరమైనవారికి సరఫరా చేయలేకపోవడం వల్ల చాలామందికి అందడం లేదు.

అనేక పంటల దిగుబడులునూనెగింజలు మరి చిక్కుళ్లు.. రైతులకు తక్కువ ఆదాయాన్ని ఇస్తున్నాయి. ఏటా సుమారు 70,000 కోట్ల రూపాయిల విలువైన వంటనూనెలను దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. రైతుల ఆదాయం పెరగాలంటే.. ఉత్పత్తిని పెంచాలి. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే.. పండ్లు మరియు కూరగాయల ఉత్పత్తి నిల్వలు మన దేశంలో తక్కువ. ఎందుకంటే వ్యాధికారక తెగుళ్లను నియంత్రించడంలో చాలా సమస్యలున్నాయి.

విభజించు మరియు పాలించు

ప్రస్తుతం 2.4 ట్రిలియన్ డాలర్లు ఉన్న మన ఆర్థిక వ్యవస్థ.. రెట్టింపు జీడీపీతో.. 2030 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద మూడో ఆర్థిక వ్యవస్థగా ఎదిగే అవకాశం ఉంది. కాని, జీడీపీకి వ్యవసాయం వల్ల సమకూరే వాటా సుమారు 15 శాతం పడిపోయింది. సుమారు 50 శాతం జనాభా వ్యవసాయంపైనే ఆధారపడుతున్నా రంగం ఇంకా కుచించుకుపోతోంది. అన్నదాతలనే పేరుతో రైతులను నాయకులుగా చెబుతారు. అయినా సరే.. దాదాపు 40 శాతం మంది రైతులు.. వ్యవసాయాన్ని వదిలేయాలనుకుంటున్నారు. 2/3 వంతు మంది రైతులు.. తమ పిల్లలను వ్యవసాయం చేయడానికి ఒప్పుకోవడం లేదు. వ్యవసాయరంగంలో రైతుల ఆత్మహత్యలు అత్యంత బాధాకరమైన విషయం.

భారీ సబ్సిడీల గురించి ఎక్కువగా చెబుతున్నప్పటికీ, వ్యవసాయంలో ప్రతికూల సబ్సిడీ ఉందని శరద్ జోషీ.. 1990ల్లో  ప్రస్తావించారు. దీని ప్రకారం వ్యవసాయ రంగం కూడా పన్నులు చెల్లించాల్సి వస్తోంది. మొత్తం సబ్సిడీల వల్ల, ప్రభుత్వ విధానాల వల్ల రైతులు తమ ఉత్పత్తికి తక్కువ ధరలను పొందాల్సి వస్తోందని కిందటేడాది అంతర్జాతీయ నివేదిక తెలిపింది. 2000 నుంచి 2016 మధ్య మైనస్ 14 శాతం    (-14%) ప్రతికూల మద్దతు అందిందని అంచనా.

సబ్సిడీ పొందిన రైతులు అనే అంశం.. గ్రామీణ, పట్టణ భారతాన్ని విభజిస్తుంది. వినియోగదారుల సంరక్షణ పేరుతో రైతులపై నియంత్రణ పెరిగిపోతోంది. పన్నులు లేని మరియు పేద రైతులను మోసగిస్తున్నారు. అయినప్పటికీ వినియోగదారులకు కూడా అందాల్సిన సౌకర్యాలు అందడం లేదు.

సరిదిద్దాల్సిన చట్టాలు

1991 నుంచి ఆర్థిక సంస్కరణలు అమల్లోకి వచ్చినా.. భారతదేశంలో అతిపెద్ద ప్రైవేట్ సెక్టార్ గా ఉన్న వ్యవసాయ రంగం మాత్రం అనేక సంకెళ్లతో ముడిపడిపోయింది.

సాగుకు సంబంధించి.. భూమి నుంచి విత్తనాల వరకు, వివిధ రకాల ఇన్ పుట్స్ నుంచి అవుట్ పుట్స్ వరకు అన్నింటినీ.. అనేక రకాల చట్టాలు, నిబంధనలు నియంత్రిస్తున్నాయి. దీంతోపాటు రైతులు అప్పు తీసుకోవాలన్నా, మౌలిక వసతులు సమకూర్చుకోవాలన్నా, మార్కెట్ ను ఏర్పరుచుకోవాలన్నా, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలన్నా అవకాశాలు పరిమితంగా, నియంత్రణతో, నిషేధంతో ఉంటాయి

అందుకే రైతులు వ్యవసాయాన్ని వదిలేయలేని, జీవనోపాధి కోసం ఇతర మార్గాలను చూసుకోలేని పరిస్థితి నెలకొని ఉంది. ఎటు చూసినా నాణ్యత లేని విద్య, ఆరోగ్య సేవలు, అతి తక్కువగా ఉండే ఆర్థిక అవకాశాలే కనిపిస్తాయి. తీవ్రమైన నిరాశలో కూరుకుపోయిన రైతన్నలు ఎక్కడికీ వెళ్లలేని దుస్థితిలో ఉన్నారు. తమ జీవితాలను అభివృద్ధి చేసే మెరుగైన అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు.

భారతీయ వ్యవసాయ రంగం పేదరికంలో ఉంది. దీనికి కారణం రైతుల అసమర్థత కాదు. వారికి కావలసిన స్వేచ్ఛా, ఆర్థిక దన్ను లేకపోవడమే.


రైతులకు, వారి స్వేచ్ఛకు వ్యతిరేకమైన చట్టాలు

భూమిని అన్ లాక్ చేయాలి (భూమికి బంధనాలు తొలగించాలి)

రైతులకు భూమే ప్రధాన ఆస్తి. సమాజంలో వేరే వర్గాన్ని అయినా చూడండి.. వాళ్ల ఆస్తులు పెంచుకోవడానికి, పెట్టుబడులు పెట్టి వాటి విలువను పెంచడానికి చూస్తారు. కాని అదే పని రైతులు చేయడానికి అవకాశం లేదు. దానికి చట్టాలు అడ్డొస్తాయి. రైతులపై భూసేకరణ చట్టం ఎప్పుడూ కత్తిలా వేలాడుతూ ఉంటుంది. ఇది ప్రభుత్వాలకు ఆయుధం లాంటిదని చెప్పచ్చు. చాలామంది రైతులు.. తమ భూమిని అద్దెకు కాని, తనఖాకు కాని చట్టపరంగా ఇవ్వడానికి వీలులేదు. అతడు మరో రైతుకు మాత్రమే భూమిని అమ్మడానికి వీలుంది. కానీ కొద్ది మంది రైతులకు మాత్రమే భూమిని కొనే స్థోమత ఉంటుంది. అది కూడా ల్యాండ్ సీలింగ్ చట్టాలకు లోబడి మాత్రమే.

వ్యవసాయాన్ని ఒక వ్యాపారంగా ఎప్పుడూ వారు చూడలేదు. అదొక జీవనవిధానంగా మాత్రమే చూశారు. వారి భూమిని వేరే విధంగా ఉపయోగించుకోవడానికి కూడా వీలులేదు.

భూమి చట్టాలను ఎత్తివేయడానికి బదులుగా, అవి నియంత్రించే ఆర్థిక పరమైన వ్యవహారాలు.. అంటే అద్దె, తనఖా, భూమి విక్రయం, మోడల్ ల్యాండ్ లీజింగ్ రూపంలో ఉన్న కొత్త నిబంధనలు, కాంట్రాక్ట్ వ్యవసాయ చట్టాలను ప్రవేశపెట్టాలి. చట్టంలో ఉండే విభాగాలు.. చట్టపరమైన పాలనకు ఏమాత్రం ప్రత్యామ్నాయం కాదు. ఇలాంటి వాటివల్ల రైతులు ఇంకా ఊబిలో కూరుకుపోతున్నారు. న్యాయవ్యవస్థ సామర్థ్యాన్ని ఇలాంటి చట్టాలు వివాదాల్లోకి నెట్టేస్తున్నాయి. ఇలాంటివన్నీ ఆర్థికవ్యవస్థపై భారాన్ని మోపుతున్నాయి.

స్వేచ్ఛా వాణిజ్యం:

ఆర్థిక వ్యవస్థ పురోగమించడానికి, వృద్ధి చెందడానికి స్వేచ్ఛా మరియు పోటీతత్వం ఉండే మార్కెట్లు అవసరం. ఆస్తి హక్కులకు సంబంధించి గుర్తింపు, గౌరవం కూడా ఉండాలి. ఇవన్నీ స్వేచ్ఛా వాణిజ్యానికి మార్గాన్ని ఏర్పరచాలి. కానీ రైతులకు మాత్రం తమ ఉత్పత్తిని ఎక్కడ, ఎంత ధరకు అమ్మాలి అన్నదానిపై అనేక నిబంధనలు ఉంటాయి. ఇవన్నీ అన్నదాతల ఆస్తిహక్కులను ఉల్లంఘిస్తున్నాయనే చెప్పాలి.

ఎసన్షియల్ కమోడిటీస్ చట్టం ప్రకారం.. పంట ఉత్పత్తి ధరలు స్థిరంగా ఉండాల్సి పోయి.. భయంకరమైన హెచ్చుతగ్గులకు లోనవుతాయి. ఇలాంటి చట్టాల వల్ల రైతులు ప్రమాదంలో పడుతున్నారు. వీరికి పెట్టుబడులు పెరుగుతున్నాయి. వర్తకుల్లో అనిశ్చితికి దారితీస్తోంది. సరఫరాలో తేడా వస్తుంది దీనివల్ల వినియోగదారులకు కొరత తప్పదు.

ఇలాంటి అనిశ్చితమైన వాతావరణంలో.. శాశ్వతమైన ముప్పుగా పరిణమించిన ఇలాంటి చట్టాల వల్ల రైతులకు వ్యవసాయంపై ఆసక్తి తగ్గిపోతుంది. పెట్టుబడీ తగ్గిపోతుంది. పంట ఉత్పత్తి తరువాతి దశలపై దృష్టి తగ్గితే.. అది చాలా సమస్యలకు దారితీస్తుంది. వృథా పెరుగుతుంది. వర్తకం, పంపిణీ వ్యవస్థలో అసమర్థత రాజ్యమేలుతుంది. ఉత్పత్తి.. పొలం నుంచి వినియోగదారులకు చేరేలోపు దాని ధర విపరీతంగా పెరిగిపోతుంది.

ఫ్యూచర్ ట్రేడింగ్:

రైతులెప్పుడూ.. ఒక పంటకు, భవిష్యత్తులో వచ్చే ధరలకన్నా.. గతంలో పంటకు వచ్చిన ధరలను బట్టి సాగుచేస్తారు. అదే పంటను ఎక్కువమంది వేయడం వల్ల దాని నిర్వహణ ఖర్చు పెరుగుతుంది. గతంలో లాభాలను దృష్టిలో పెట్టుకుని ఎక్కువగా పంటను వేయడం వల్ల.. ఉత్పత్తి పెరిగి దాని ధర పడిపోయే అవకాశముంది. ఇలాంటి దారుణమైన వాతావరణం వల్ల రైతుల్లో, వినియోగదారుల్లో అనిశ్చితి పెరుగుతుంది.

వ్యవసాయ ఉత్పత్తుల ఫ్యూచర్ ట్రేడింగ్ అనేది రోలర్ కోస్టర్ పై ప్రయాణం లాంటిది. ఎందుకంటే.. ప్రభుత్వ విధానాల్లో తరచుగా మార్పులు ఉంటాయి. ఇంకా అడ్ హాక్ జోక్యం వల్ల మార్కెట్లు ఒడిదొడుకులకు లోనవుతాయి. రాజకీయ లాభాలను ఆశించేవారి వల్ల మార్కెట్ల గమనం గాడి తప్పుతుంది. వాటిపై ప్రజలకు అపనమ్మకం ఏర్పడుతుంది.

అవరోధాలు లేని ఫ్యూచర్ ట్రేడింగ్ వల్ల సరసమైన ధరలు లభిస్తాయి. అస్థిరత తగ్గుతుంది. ప్రమాదాలు తగ్గుతాయి. మార్కెట్లను ఊహించడానికి అవకాశం ఏర్పడి స్థిరత్వం నెలకొంటుంది. దీనివల్ల రైతులు, వ్యాపారులు, వినియోగదారులకు లాభం చేకూరుతుంది.

సాంకేతికత & విజ్ఞానానికి మార్గం:

పర్యావరణంపై తక్కువ ప్రభావం చూపించి.. ఉత్పాదకతను పెంచడంలో సాంకేతిక పరిజ్ఞానం చాలా ఉపయోగపడుతుంది. వ్యవసాయం కాకుండా మిగిలిన రంగాల్లో అత్యాధునిక ఉత్పత్తులు, సేవలు, కొత్త పరిజ్ఞానాలు అందుబాటులోకి వస్తున్నాయి. కాని రైతులకు మాత్రం అలాంటి ఉత్పత్తులు అందుబాటులో లేవు. కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునే సామర్థ్యమూ లేదు.

జన్యుపరంగా మార్పుచేసిన పత్తిని గత దశాబ్ద కాలంగా భారతదేశం తన పరం చేసుకుంది. ఇండియా.. ప్రపంచంలోనే అతి ఎక్కువగా పత్తిని ఉత్పత్తి చేసే దేశంగాను, ఎక్కువగా ఎగుమతి చేసే దేశాల్లో రెండవది గాను అవతరించింది. కానీ దీని వేడుకలను జరుపుకోవడానికి ముందు.. బయోటెక్నాలజీ విషయంలో ప్రభుత్వ అశక్తత, సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల భారతీయ రైతులు.. సెకండ్ జనరేషన్ టెక్నాలజీ దగ్గరే ఆగిపోయారు. దీనివల్ల వారు చాలా కోల్పోయారు. ఇదే సమయంలో ఇతర దేశాల్లో పత్తిని పండించే రైతులు.. నాలుగో, ఐదో జనరేషన్ టెక్నాలజీని ఉపయోగించి సాగు చేస్తుండడంతో ప్రయోజనాలు పొందుతున్నారు.

ప్రపంచంలో 12 రకాల పంటలు, ఒక చేప విషయంలో జన్యుపరమైన మార్పులను ఆమోదించారు. టెక్నాలజీని ఉపయోగించి.. వ్యాధులు రాకుండా, వాటి నిరోధక శక్తిని అభివృద్ధి చేశారు. ఉత్పత్తిని, నాణ్యతను పెంచి కరువు లేకుండా చేశారు.

జన్యుమార్పిడి సాంకేతిక పరిజ్ఞానం వినియోగించే విషయంలో ప్రభుత్వం నిబంధనలు విధించింది. విత్తనాలపై ధరల నియంత్రణను విధించింది. రైతులు ఎప్పుడూ అధిక ధరలకు అనధికారిక విత్తనాలను కొంటూ ప్రమాదంలో పడుతున్నారు. కాని.. పరిస్థితులను చక్కదిద్దుకుని అభివృద్ధి చేసుకోలేకపోతున్నారు.

ఇలాంటి నిబంధనల వల్ల.. ప్రైవేటు కంపెనీలు పరిశోధనలపై తమ పెట్టుబడులను తగ్గిస్తున్నాయి. కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టడం లేదు. ఇదే సమయంలో భారతీయ శాస్త్రవేత్తలు.. వ్యవసాయ బయోటెక్నాలజీలో పరిశోధనలు చేద్దామనుకున్నా సమయానికి సరైన సదుపాయాలు ఉండవు. జీఎం ఆవాలు, జీఎం వంకాయలే దానికి ఉదాహరణ. మన దేశంలో యువ శాస్త్రవేత్తలు వ్యవసాయ జీవసాంకేతికతపై పరిశోధనలు చేయడానికి ఇష్టపడడం లేదు. అందుకే చాలామంది భారతీయ శాస్త్రవేత్తలు విదేశాల్లో పనిచేస్తూ ఉన్నత శిఖరాలకు చేరుకుంటున్నారు.

దాదాపు 40 ఏళ్ల కిందట సమాచార సాంకేతిక విప్లవం.. ప్రభుత్వ విధానాల్లో లోపాల వల్ల మన దేశం దాటి వెళ్లిపోయింది. ఇప్పుడదే తప్పును వ్యవసాయ బయోటెక్నాలజీ విషయంలో మళ్లీ చేస్తున్నారు.

చివరిగా చూస్తే.. రైతులు తమకు ఏవి నచ్చితే విధానాల్లో సాగు చేసుకునే స్వేచ్ఛ ఉండాలి. దీనివల్ల ఆధునిక సైన్స్, ఇంకా వ్యవసాయ రంగానికి సంబంధించిన ఇతర పద్దతుల వల్ల అన్నదాతలకు ఎలాంటి సమస్యలు రావు.

పర్యావరణ ఒత్తిడి :

వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న ప్రధానమైన సవాళ్లు.. నీటి వనరుల లేమి, పర్యావరణపరమైన మార్పులు. బియ్యం విషయంలో తప్పుదోవ పట్టించే ప్రభుత్వ పాలసీయే దీనికి ఉదాహరణ. వరి ఎక్కువగా పండని రాష్ట్రాల నుంచి దానిని సేకరిస్తారు. దీనివల్ల పంజాబ్, హర్యానా లాంటి రాష్ట్రాల్లో నీటి వనరుల లభ్యత పెద్ద సమస్యగా మారింది. పంట కోయగా మిగిలిపోయిన వృథాను ఖరీఫ్ సీజన్ ఆఖర్లో తగులబెట్టేస్తారు. రబీ పంటలను వేయడానికి వీలుగా ఇలా చేస్తారు. దీనివల్ల ఉత్తర భారతదేశంలోని గాల్లో కాలుష్యం విపరీతంగా పెరుగుతోంది.

రైతులు, వర్తకుల మధ్య జల ఒప్పందాలు, వర్తక సదుపాయాల హక్కుల కల్పనలో సమస్యల వల్ల వాటర్ మార్కెట్ అభివృద్ధి చెందుతోంది. దీనివల్ల నీళ్ల ధర పెరుగుతోంది. అందుకే నీటిని చాలా జాగ్రత్తగా, సమర్థవంతంగా వినియోగించాల్సి వస్తోంది.

పన్నుల విధానంలో పారదర్శకత:

వ్యవసాయంపై పన్ను లేదన్న ముసుగులో రైతులను విపరీతంగా దోచుకుంటున్నారు. మరోవైపు, కొంతమంది ధనవంతులు, పలుకుబడి కలిగినవాళ్లు.. తమ అక్రమ సంపాదనను వ్యవసాయ ఆదాయంగా చూపిస్తున్నారు.

సంక్లిష్టంగా ఉండే పరోక్ష పన్నుల వ్యవస్థ, అనేక రకాల పథకాలు, సబ్సిడీలు.. వీటన్నింటిని లెక్కలోకి తీసుకుంటూ రైతులకు అన్యాయం చేస్తున్నారు.

సరళమైన, సమర్థవంతమైన ప్రత్యక్ష పన్నుల వ్యవస్థ పారదర్శకంగా ఉండాలి. ప్రజలు, రైతులు అందరూ అనేక రకాల చట్టాలకు లోబడి ఉండేటట్లుగా వాటిని తీర్చిదిద్దాలి.


భారత్ నుంచి ఇండియా వరకు

రైతులందరినీ సంఘటితంగా ఉంచడం వల్ల.. దాని ఫలితం ధరల్లో కనిపిస్తుంది. రైతులు కానివారు తమ సొంత ఆశయాలను చేరుకోవడానికి చాలా ఒడిదొడుకులను ఎదుర్కోవాల్సి వస్తోంది. రైతులకు కనీసమైన గౌరవం, న్యాయం కూడా దక్కనీయలేదు. అన్నదాతలకు ఆర్థికపరమైన స్వేచ్ఛను సమాజం ఇవ్వలేదు. వ్యవసాయేతర రంగాలకు మాత్రం ప్రాధాన్యత దక్కింది.

భారత్ ఎప్పుడైతే స్వేచ్ఛను అనుభవిస్తుందో.. అప్పుడే ఇండియా పురోగమిస్తుంది. ఇండియా గ్రామాల్లోనే నివసిస్తుంది. గ్రామాలే దేశానికి పట్టుగొమ్మలు అని గాంధీజీ అన్న మాటలు ప్రజలందరికీ చేరినప్పుడే సురక్షితమైన భారతదేశాన్ని సాధించగలం. అయినప్పటికీ.. అన్నదాతలు మాత్రం ఇప్పటికీ స్వాతంత్ర్యఫలాలను అనుభవించలేకపోతున్నారు.

2019లో గాంధీజి 150 జయంతి ఉంది. అందుకే నేటి భారతంలో రైతులకు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు కల్పించాలని మేనిఫెస్టో కోరుతోంది. దీనివల్ల శాంతి, అభివృద్ధి.. భవిష్యత్ భారతాన్ని సుసంపన్నం చేస్తాయి.

 

జైహింద్

 

ఈ తెలుగు అనువాదం డ్రాఫ్ట్. దయచేసి తాజా నవీకరణ కోసం రైతుల మానిఫెస్ట్ యొక్క ఇంగ్లీష్ వెర్షన్ను చదవండి. ఇక్కడ నొక్కండి.

వ్యాఖ్యలు మరియు సలహాల కోసం, దయచేసి వ్రాయండి (For comments and suggestions, please write): admin@FarmersManifesto.info or FarmersManifesto@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

clear formPost comment